24, డిసెంబర్ 2011, శనివారం

2011 వెనక్కి తిరిగి చూస్తే


2010 మొదటి జీతాన్ని చేతిలో పెట్టి సెలవు తీసుకుంది.ఆ రాత్రి పిజ్జా తిని  చెన్నై వీదుల వెంట తిరుగుతూ కేకలు వేసాము (జి హర్ష ,చిక్కం ,బలరాం మా guests   ).
చెన్నై లో మొదటి సంక్రాంతి ని చూసాను(మా కు ఇక్కడ పొంగల్ మరి ).ఇంతకుముందు ఇక్కడి పొంగల్ celebrations గురించి విన్నదే కానీ ఇక్కడ ఆ పండగ కంటే గని తెలియలేదు వీరి శివ భక్తీ పరాకాష్ట ఎంతో . 
ఆ తరువాత వంశి వాళ్ళు చెన్నై లో కొత్త రూం చూస్తూ ఉంటె నేను అక్కడ GATE preparation కోసం రామిరెడ్డి ని ఆశ్రయించాను . ఇంకా బెంచ్ రోజుల్లో వంశి ,హర్ష చేసిన  సంతక  సేవలను మరచి పోవడం అసాద్యం.
ఏప్రిల్ 1 న బెంచి కదా కంచి కి చేరింది.అదేమీ ఏప్రిల్ 1 మూహుర్త  బలమో కానీ నాకు మంచి సహోద్యోగులు దొరికారు.
bugs తో కొట్టిమిట్టాడు  తున్న ప్రాజెక్ట్ లో నా ఎంట్రీ తో 3 గురు తమిళులు 6 గురు తెలుగు వాళ్ళు గా సాగింది.(సపోర్ట్ ప్రాజెక్ట్  కదా సాగుతూ ఉంది ).

ఇక ఆర్ధిక విషయాలకు వస్తే  చిరకాల కోరిక గా ఒక బైక్ కొన్నాను. బ్యాంకు వాళ్ళు వాళ్ళ కృషి కొద్ది ఒక క్రెడిట్ కార్డు, loan అంట గట్టారు.

SSB ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాను. ఎం   చేస్తాం వాళ్ళకి నా ఉపయోగం లేక పోయింది. .కానీ ఆ 5 రోజులు బాగా చూసుకున్నారు .

P.S:  నేను సైతం ఒక మ్యాచ్ లైవ్ లో చూసి క్రికెట్ అభిమానాన్ని చాటుకున్నాను.ఏప్రిల్ 2 న దేశం మొత్తం సంబరపడడం.
ప్రవీణ్ కి ISRO లో ఉద్యోగం రావడం,  రామి రెడ్డి MS చేయడం జీవితం లోనే most  happy moments .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి